గుంటూరు జిల్లాలోని పొత్తూరులో పేదలకు.. జగనన్న ఇళ్ల పట్టాలను హోంమంత్రి మేకతోటి సుచరిత పంపిణీ చేశారు. అనంతరం నూతన గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంకిరెడ్డిపాలెం, చౌడవరం, పొత్తూరు, నల్లపాడు, ఓబుల్ నాయుడు పాలెంకు చెందిన 809 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. సీఎం దృఢ సంకల్పంతో పేదలకు సొంత ఇంటి కళ నెరవేరుతుందని సుచరిత అన్నారు.
పొత్తూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన హోంమంత్రి - distribution of house sites news
గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరులో జగనన్న ఇళ్ల పట్టాలను హోంమంత్రి మేకతోటి సుచరిత పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అందించారు.
ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న హోంమంత్రి మేకతోటి సుచరిత
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు పెద్ద సంఖ్యలో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేదల పాలిట గొప్ప వరమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని హోంమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నరసరావుపేటలో ఇళ్ల పట్టాల పంపిణీ