నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతుల నుంచి తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన జిల్లా వ్యవసాయ మండలి కమిటీ అభినందన సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. అలాగే ఈ నెలాఖారులోగా పెట్టుబడి రాయితీ నగదు జమ చేస్తున్నట్లు ప్రకటించారు.
గుంటూరు ఛానెల్ ఆధునికీకరణ, ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పొడిగింపునకు 600 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని, ప్రస్తుతం పనులు టెండర్ల దశలో ఉన్నాయని పేర్కొన్నారు. కొమ్మమూరు కాల్వ వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి 5 వేల ఎకరాలు సాగు నీరు అందేలా... అప్పాపురం ఛానల్ కు నీరు సరఫరా చేసేందుకు తగిన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ నల్లమోతు శివరామకృష్ణను, డైరెక్టర్లను హోంమంత్రి, ఎమ్మెల్యేలు సత్కరించారు.