మహిళల భద్రత కోసం చిత్తశుద్ధితో దిశ చట్టాన్ని తీసుకొస్తే తెదేపా నేతలు ఆ చట్టాన్ని అవహేళన చేయటం తగదని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్ల ముందు తెదేపా నేతలు.. ఆందోళనలకు పిలుపునివ్వటాన్ని ఆమె తప్పుబట్టారు. రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే చట్టాన్ని అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. దిశ యాప్ ద్వారా అనేకమంది మహిళలు రక్షణ పొందుతున్నారని తెలిపారు.
DISHA ACT: 'దిశ చట్టాన్ని అవహేళన చేయటం తగదు..' - tdp comments on disha act
దిశ చట్టం అమలులోకి రాకపోయినా అదే స్పూర్తితోనే పని చేస్తున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తెదేపా నేతలు దిశ చట్టాన్ని అవహేళన చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
home minister mekathoti sucharitha
తెదేపా అధికారంలో ఉండగా మహిళా తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే దాడి చేసినా పట్టించుకోలేదని హోంమంత్రి విమర్శించారు. ఇప్పుడు మహిళలపై దాడి జరిగితే ఏడు రోజుల్లోనే ఛార్జ్‌షీట్ వేస్తున్నామని వివరించారు. దిశ చట్టం అమలులోకి రాకపోయినా అదే స్పూర్తితోనే పని చేస్తున్నట్లు చెప్పారు. మహిళల రక్షణ కోసం సలహాలిస్తే స్వీకరిస్తామని.. అంతేగాని దిశ చట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని మంత్రి సుచరిత సూచించారు.
ఇదీ చదవండి: