తెదేపా కంచుకోటలో వైకాపా బలోపేతం కావడం సంతోషంగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో ఇటీవల వైకాపా మద్దతుతో గెలుపొందిన సర్పంచులను ఆమె సత్కరించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అన్నారు. తెదేపా అవిర్భవించాక కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో వేరే పార్టీకి అవకాశం లేకుండా పోయిందని... అలాంటి ప్రాంతంలో వైకాపాను గెలిపించేందుకు నాయకులు చేసిన కృషి అభినందనీయమని అన్నారు.
గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి మరింత దగ్గర చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్లు నల్లమోతు శివరామకృష్ణ, మదమంచి వాసు, ఎస్సీసెల్ మండల కన్వీనర్ గేరా పున్నారావులు పాల్గొన్నారు.