రోడ్డు ప్రమాదం బారిన పడి.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. క్షతగాత్రులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబానికి 2 లక్షల పరిహారంతో పాటు అర్హులైన వారికి వైఎస్సార్ బీమా కింద వచ్చే సాయాన్ని అందిస్తామన్నారు. ప్రమాదంలో గాయపడిన, మృతుల కుటుంబాలకు ఇంటి స్థలాన్ని కేటయిస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను హోం మంత్రి ఆదేశించారు. హోం మంత్రితో పాటు, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, అర్బన్ ఎస్పీ రామకృష్ణ క్షతగాత్రులను పరమర్శించారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం...2 లక్షల పరిహారం: హోంమంత్రి - home minister
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి సుచరిత, కలెక్టర్, ఎస్పీ పరామర్శించారు.
home minister
TAGGED:
home minister