సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో చాలా జాగ్రత్త వ్యవహరించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పేదలకు నివేశన స్థలాల పంపిణీపై ఆమె ఎమ్మార్వోలతో సమావేశమై పలు సూచనలు చేశారు.
అర్హులైన పేదలకు అన్యాయం జరగకూడదు: హోంమంత్రి సుచరిత - పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు పథకం
పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో జాగ్రత్త వహించాలని హోంమంత్రి సుచరిత అధికారులను ఆదేశించారు. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని అధికారులకు సూచించారు.
home minister
జాబితాలో అనర్హులు ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే.. విచారించి లిస్ట్‌లో నుంచి పేరు తొలగించాలని ఆదేశించారు. అర్హులైన పేదలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని హోంమంత్రి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో పురోగతి, అర్హులైన కొత్త లబ్ధిదారులను విచారించి జాబితాలో చేర్చాలని ఎమ్మార్వోలకు హోంమంత్రికి సూచించారు.
ఇదీ చదవండి:కోయంబత్తూరులో మరో గజరాజు మృతి!