పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి వచ్చే జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. జగన్ పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమానులో నిర్వహించిన 'ప్రజలతో నాడు- ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
పోలీసు శాఖలో వచ్చే జనవరి నెలలో 6500 ఖాళీలు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ సూచించారని చెప్పారు. ప్రతి ఏడాది జనవరిలో పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.