గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మానుకొండ వారి పాలెం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మరణం చెందాడు. గుంటూరు ఆర్టీవో కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న హోంగార్డు నిరీక్షణ రావు ఆదివారం ఈస్టర్ పండుగను పురస్కరించుకుని కాకుమాను మండలంలోని స్వగ్రామమైన గరికపాడు గ్రామానికి వెళ్లాడు. అక్కడ తన పూర్వీకుల సమాధులకు రంగులు వేయించి తిరిగి బుల్లెట్ వాహనంపై చిలకలూరిపేట బయలుదేరాడు.
వేగం ధాటికి హెల్మెట్ సైతం నుజ్జునుజ్జు..
చిలకలూరిపేట నుంచి పెదనందిపాడు వైపు ద్విచక్రవాహనం మీద ప్రయాణిస్తుండగా.. మార్గమధ్యంలో మానుకొండవారి పాలెం సమీపంలో ఒక మలుపువద్ద మహేంద్ర మినీ వ్యాన్ హోంగార్డు వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఆ సమయంలో నిరీక్షణరావు శిరస్త్రాణం ధరించినప్పటికీ.. ఎదురుగా వచ్చిన వాహనం వేగంగా ఢీకొట్టడంతో అది పగిలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై భాస్కర్... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
రౌడీషీటర్ల ఆధిపత్య పోరు..హత్యాయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు