గుంటూరు భజరంగ్ జూట్ మిల్ సమస్య పై సచివాలయంలో హైలెవెల్ కమిటీ సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ , కార్మిక , పరిశ్రమల, వాణిజ్య పన్నుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మిల్ సమస్యపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. కార్మికులు, యాజమాన్యంతో చర్చించి సమగ్రమైన నివేదికను అందించాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులకు న్యాయం జరగలేదన్న వెల్లంపల్లి.. కార్మికుల అభ్యర్థనతో అందరికీ న్యాయం చేసేలా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
జూట్ మిల్ సమస్యపై సచివాలయంలో హైలెవెల్ కమిటీ భేటీ - ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
గుంటూరు భజరంగ్ జూట్ మిల్లుపై నెలకొన్న సమస్యపై సచివాలయంలో హైలెవెల్ కమిటీ సమావేశం జరిగింది. కార్మికులు, యాజమాన్యంతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
జూట్ మిల్ సమస్యపై సచివాలయంలో హైలెవెల్ కమిటీ సమావేశం
ఇదీ చదవండి:
''భగవంతుడా.... నాకు ఎందుకీ శిక్ష''?