గుంటూరు జిల్లావ్యాప్తంగా గడచిన 24 గంటల్లో సగటున 4.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో వర్షం కురవగా... అత్యధికంగా రెంటచింతల మండలంలో 40 మి.మీ వాన కురిసింది. గురజాల 31.2, ఈపూరు 18.4, యడ్లపాడు 13.2, దుర్గి 10.8 మి.మీ వర్షపాతం నమోదైంది.
గుంటూరు జిల్లాలో వర్షం.. రెంటచింతలలో అత్యధికం - వర్షం తాజా వార్తలు
నైరుతి రుతుపవనాలు క్రమంగా రాష్ట్రమంతటా విస్తరిస్తుండటంతో.. తొలకరి వానలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా వర్షం పడింది. అత్యధిక వర్షపాతం రెంటచింతల మండలంలో నమోదైంది.
గుంటూరు జిల్లాలో వర్షం