గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్. టీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు తీర్పు ఇచ్చారు. గురవాచారి అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు, అనంతరం నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ యరపతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో కారణాలు లేవని, ఫిర్యాదు చేయడంలో తీవ్ర జాప్యం ఉందని యరపతినేని తరఫు న్యాయవాది వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి కేసును కొట్టేశారు.
యరపతినేనికి హైకోర్టులో ఊరట - scraped case
తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
![యరపతినేనికి హైకోర్టులో ఊరట](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4294991-857-4294991-1567207904606.jpg)
తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి హైకోర్టులో ఊరట
ఇదీ చదవండి :