High Court On Capital Farmers Petition : రాజధాని రైతులు తలపెట్టిన మహాపాదయాత్రలో ఆంక్షలపై.. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సవరించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారితో కలిసి నడిచేందుకు అనుమతినివ్వాలని కోరుతూ రైతు సంఘాలు అప్పీల్‌ను దాఖలు చేశారు. వివిధ రకాలుగా సంఘీభావం తెలిపేందుకు వస్తుంటారని.. తమకు ముందు, వెనుక సంఘీభావం తెలిపే వాళ్లు నడిచేందుకు అనుమతినివ్వాలని.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. అప్పీళ్లలో జోక్యం చేసుకోబోమంటూ పిటిషన్‌ను కొట్టేసింది.
అప్పీళ్లలో జోక్యం చేసుకోలేం.. రైతు సంఘాల అప్పీళ్లను కొట్టివేసిన హైకోర్టు - High Court On Capital Farmers Petition
High Court Dismissed Farmers petition: అమరావతి రైతుల పాదయాత్రలో నడిచేందుకు హైకోర్టును అనుమతి కోరిన రైతు సంఘాలకు చుక్కెదురైంది. రైతుసంఘాల అప్పీళ్లలో జోక్యానికి నిరాకరించిన సీజే నేతృత్వంలోని బెంచ్.. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
High Court Dismissed Farmers petition