గుంటూరు జిల్లాలో కరోనా కలకల రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ కారణంగా.. అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా గుంటూరు నగరానికి సంబంధించిన ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ చేశారు. వైరస్ నియంత్రణపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. శంకర్‌విలాస్ కూడలి, మణిపురం వంతెన వద్ద వాహనాల రాకపోకలు నిలిపివేశారు. నిత్యవసర సరుకుల క్రయ విక్రయాలకు... 9 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు.
కరోనా కేసుల ఎఫెక్ట్: గుంటూరులో హై అలర్ట్ - shoutdown AP due to corona virus taja news
రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల కారణంగా.. గుంటూరు జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నిత్యావసర సరుకుల విక్రయాలు, కొనుగోళ్లకు ఇస్తున్న సమయాన్ని మరింత కుదించారు.
గుంటూరులో హైఅలెర్ట్ ప్రకటించిన అధికారులు