ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పీపీఏలపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు' - PPAs defame government

పీపీఏలపై ఎవరెన్ని చెప్పినా జగన్‌  రివర్స్​లో వెళ్లి భంగపడ్డారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. పీపీఏలపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు. ఈ తీర్పుతో తెదేపాపై తప్పుడు నిందలు వేశారన్న విషయం రుజువైందని వారు పేర్కొన్నారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు

By

Published : Sep 24, 2019, 6:52 PM IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు

పీపీఏలపై హైకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుతో తెదేపాపై తప్పుడు నిందలు వేశారన్న విషయం రుజువైందన్నారు. ముడుపుల కోసమే జీవో నెంబర్ 63 జారీ చేశారన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. పరిపాలనలో జగన్ మూడు అడుగులు ముందుకెళ్తే.. ఆరు అడుగులు వెనక్కి వేస్తున్నారన్నారని విమర్శించారు. తెదేపాపై కక్షసాధింపు తప్ప అభివృద్ధి కోసం ఒక్క ఆలోచనా చేయటం లేదని దుయ్యబట్టారు. పరిపాలనపై జగన్​కు ఉన్న అవగాహన ఏంటో బయటపడిందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థతకు హైకోర్టు తీర్పే నిదర్శనమని కళా అభిప్రాయపడ్డారు. పీపీఏలపై ఎవరెన్ని చెప్పినా..జగన్ రివర్స్​లో వెళ్లి భంగపడ్డారన్నారు.

ABOUT THE AUTHOR

...view details