ఏపీపీఎస్సీ.. ఏఎంవీఐ నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. - AMVI NOTIFICATION
12:20 November 21
కౌంటర్ వేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం
HIGHCOURT SUSPENDED THE AMVI NOTIFICATION : ఏపీపీఎస్సీ చేపట్టిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ) నోటిఫికేషన్ను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తూర్పుగోదావరికి చెందిన కాశీ ప్రసన్నకుమార్.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లకు వ్యతిరేకంగా ప్రశ్నాపత్రం కేవలం ఇంగ్లీషులో మాత్రమే ఉంటుందని ఇవ్వటం సరికాదని పిటీషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీషులో మాత్రమే ఇవ్వటం రాజ్యాంగ సూత్రాలకి, న్యాయ సూత్రాలకు వ్యతిరేకమన్నారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. నోటిఫికేషన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: