గుంటూరు జిల్లా తాళ్లాయ పాలెం మండలం మందడంలోని తమ ప్రాజెక్ట్ సైట్ నుంచి ప్రభుత్వం ఇసుక తరలించడంపై అభ్యంతరం తెలుపుతూ... ఎల్అండ్టీ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన ధర్మాసనం... ఇసుకపై పూర్వ స్థితినే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక సర్కారుదే అంటూ జారీ అయిన ఉత్తర్వులను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. కిందటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎల్అండ్టీ సంస్థ రాజధానిలో పలు నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. నిర్మాణ పనుల కోసం ఎల్అండ్టీ సంస్థ పెద్ద మొత్తంలో ఇసుకను తమ ప్రాజెక్టు సైట్లలో నిల్వ ఉంచింది. ఇప్పుడు అక్కడి నుంచే ప్రభుత్వం ఇసుక తరలిస్తోందని ఎల్అండ్టీ కోర్టును ఆశ్రయించింది.
ప్రభుత్వం మా ఇసుక తీసుకెళుతోంది..! హైకోర్టుకు "ఎల్&టీ" - high court suspends government orders on l and t sand project
గుంటూరు జిల్లాలో తమ ప్రాజెక్ట్ సైట్ నుంచి ప్రభుత్వం ఇసుక తరలించడంపై అభ్యంతరం తెలుపుతూ ఎల్అండ్టీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన ధర్మాసనం సర్కారు ఆదేశాలను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది.
'ఎల్అండ్టీ సంస్థ ఇసుకపై పూర్వ స్థితినే కొనసాగించండి'
Last Updated : Oct 26, 2019, 12:53 AM IST