ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేగులగడ్డలో సున్నపురాయి తవ్వకాలపై హైకోర్టు స్టే - high court stay on lime stone mining in guntur

గుంటూరు జిల్లా మాచవరం మండలం రేగులగడ్డలో సున్నపురాయి తవ్వకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. మైనింగ్‌పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మైనింగ్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

high court stay lime stone mining at regulagunta
high court stay lime stone mining at regulagunta

By

Published : Apr 7, 2021, 12:34 PM IST

గుంటూరు జిల్లా మాచవరం మండలం రేగులగడ్డలో సున్నపురాయి తవ్వి తీయడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. అక్రమ మైనింగ్‌ జరుగుతోందని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించారు. స్టే విధిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మైనింగ్‌పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మైనింగ్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. రెండు వారాల్లోపు నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా పడింది.

ఇదీ చదవండి: కర్నూలులో ప్రబలిన అతిసారం.. నలుగురు మృతి.. 40మందికి అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details