ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HC Court on IAS officer: కోర్టు ధిక్కరణ కేసు.. ఐఏఎస్ ప్రవీణ్‌కుమార్‌కు జైలుశిక్ష.. జరిమానా - IAS Praveen Kumar fined in contempt of court case

High Court
హైకోర్టు

By

Published : Jul 10, 2023, 7:48 PM IST

Updated : Jul 10, 2023, 7:59 PM IST

19:38 July 10

ప్రవీణ్‌కుమార్‌కు 2 వారాల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించిన హైకోర్టు

HC Court on IAS officer: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ కుమార్​కు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. తీర్పు అమలు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం ఏపీఐఐసీ ఎండీగా ఉన్న ప్రవీణ్‌ కుమార్.. గతంలో విశాఖపట్నం కలెక్టర్​గా పని చేశారు. ఆయన కలెక్టర్​గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు దిక్కరణ కేసును శ్రీనివాసరావు అనే వ్యక్తితో పాటు మరో నలుగురు దాఖలు చేశారు. భీమునిపట్నం మండలం కాపులప్పాడ గ్రామం పరిధిలో ఏడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేశారని, నిషేధిత భూముల జాబితాలో చేర్చారని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు.. ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులను ఉల్లంఘించారని అభిప్రాయపడింది. ప్రవీణ్‌ కుమార్​కు రెండు వారాల జైలుశిక్ష, 25 వేల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Last Updated : Jul 10, 2023, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details