ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయ్​పై బలవంతపు చర్యలు వద్దు.. సీఐడీని ఆదేశించిన హైకోర్టు - ఏపీ తాజా వార్తలు

TDP leader Chintakayala Vijay case: తెదేపా నేత చింతకాయల విజయ్ కేసు పిటిషన్​ను రాష్ట్ర హైకోర్టు విచారించింది. న్యాయవాది సమక్షంలో విచారణ కోరే అవకాశం పిటిషనర్‌కు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. విజయ్‌పై బలవంతపు చర్యలు చేపట్టవద్దని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

TDP leader Chintakayala Vijay case
తెదేపా నేత చింతకాయల విజయ్ కేసు
author img

By

Published : Oct 27, 2022, 7:17 PM IST

TDP leader Chintakayala Vijay case: తెదేపా నేత చింతకాయల విజయ్ కేసు విషయంలో హైకోర్టు సీఐడీని ప్రశ్నించింది. ఈనెల 26న విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు.. చింతకాయల విజయ్​కు ఈనెల 22న నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతీసారి హైదరాబాద్​లోని ఇంటికి వెళ్లి నోటీసులు అంటిస్తున్నారని పిటిషనర్ విజయ్​ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపించారు. తెదేపాకు, పిటిషనర్​కు సంబంధం లేదని వాదనలు వినిపించారు. సాక్ష్యాలు తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

వాదనలు విన్న ధర్మాసనం... న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోరే అవకాశం పిటిషనర్​కు ఉంటుందని స్పష్టం చేసింది. విజయ్​పై బలవంతపు చర్యలు చేపట్టవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి(ఈనెల 31) వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details