High Court on TDP Leaders Petitions:రాజధాని పరిధిలో అసైన్డ్ ల్యాండ్ (Assigned Land case) కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో మాజీ మంత్రి నారాయణపై సీఐడి అధికారులు కేసు (CID case against former minister Narayana) నమోదు చేశారు. సీఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్, క్వాష్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లపై హైకోర్టు విచారణ జరిపి.. తదుపరి విచారణను రెండు వారాలకు (High Court on Narayana petition) వాయిదా వేసింది. గతంలో రాజధాని బృహత్ ప్రణాళిక రూపకల్పన, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ 2022లో పలువురిపై కేసులు నమోదు చేసింది.
భార్యాపిల్లలు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరా - పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ఈ కేసుకు సంబంధింంచి మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, ఎన్‌ఎస్‌పీఐఆర్‌ఏ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగి ప్రమీలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ.. నారాయణ, రమాదేవి, ప్రమీల హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఆ వ్యాజ్యాలపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
కింద పడుకోవాల్సి వస్తే మన పిల్లల్ని హాస్టల్స్‌లో చేరుస్తామా- ప్రభుత్వంపై హాకోర్టు ఘాటు వ్యాఖ్యలు
High Court on Bandaru Satyanarayana Petition:తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సతీమణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సీసీటీవీ ఫుటేజిని సమర్పించేందుకు పోలీసులు కోర్టును సమయం కోరారు. పోలీసుల అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారంటూ ఇటీవల మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు. 41ఏ నోటీసు ఇచ్చిన తరువాత ఆయనను అరెస్టు చేశారని.. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ సత్యనారాయణ సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
స్కిల్ కేసు - చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
High Court on Kollu Ravindra Petition:సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై (Kollu Ravindra petition in High Court) హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారని.. కంపెనీలకు లబ్ది చేకూరేలా వ్యవహరించారని ఆరోపణలతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసింది. సీఐడి అధికారులు రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటిషనర్‌ను ఈ కేసులో ఇరికించారని.. నిబంధనల ప్రకారమే అనుమతులిచ్చినట్లు కొల్లు రవీంద్ర తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.