ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంగం డెయిరీ కేసులో మరో ఇద్దరికి బెయిలు మంజూరు

సంగం డెయిరీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ అనిశా నమోదు చేసిన కేసులో నాలుగు, ఐదో నిందితులుగా ఉన్న కె.గోపినాథ్, పి.సాంబశివరావుకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

Sangam dairy bail petition
సంగం డెయిరీ కేసు

By

Published : Jul 10, 2021, 3:37 AM IST

Updated : Jul 10, 2021, 4:02 AM IST

సంగం డెయిరీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ అనిశా నమోదు చేసిన కేసులో నాలుగు, ఐదో నిందితులుగా ఉన్న కె.గోపినాథ్, పి.సాంబశివరావుకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అనిశా నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సంగం పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అప్పటి ఎండీ కె.గోపినాథ్, ముఖ్య ఆర్థికాధికారి పి.సాంబశివరావు ఇటీవల హైకోర్టులో బెయిలు కోసం పిటిషన్ వేశారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

Last Updated : Jul 10, 2021, 4:02 AM IST

ABOUT THE AUTHOR

...view details