High Court on MLC Anantha Babu Case: దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసు హైకోర్టులో విచారణ జరిగింది. హత్య కేసును సీబీఐకీ అప్పగించాలంటూ మృతుడి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ నుంచి అందిన నివేదిక ఆధారంగా సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపిస్తున్న వ్యక్తుల పాత్ర ఏమైనా ఉందా? లేదా? లేకపోతే అందుకు కారణాలు ఏమిటి? తదితర వివరాలను అనుబంధ అభియోగపత్రంలో పోలీసులు పేర్కొనకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తున్న వ్యక్తుల పాత్రకు సంబంధించిన వివరాలతో కూడిన అనుబంధ అభియోగపత్రం వేయాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారని గుర్తుచేసింది. పోలీసుల తీరు ఇలా ఉండబట్టే.. నిష్పాక్షికంగా దర్యాప్తు జరగడంలేదని మృతుడి తల్లిదండ్రులు సందేహం వ్యక్తం చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
HC On MLC Ananthbabu Driver Case: అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.. పోలీసులపై హైకోర్టు ప్రశ్నల వర్షం
ఇరువైపు వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా పడింది. ఇరువైపు వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూ. దుర్గాప్రసాదరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తమ కుమారుడి హత్య వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ.. సుబ్రమణ్యం తల్లిదండ్రులు వీధి నూకరత్నం, సత్యనారాయణ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది జనవరి 4వ తేదీన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.