AP High Court On Bar Association Elections: హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాల నిర్వహణకు ఏడుగురు న్యాయవాదులతో అడహాక్ కమిటీని బార్ కౌన్సిల్ చైర్మన్ ఏర్పాటు చేయటంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు న్యాయవాదుల ఎన్నికలకు సిద్ధం కావాలని సంఘం కార్యవర్గానికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. బార్ అసోసియేషన్ కార్యవర్గం గడువు ముగిసినా ఎన్నికలు జరపటం లేదంటూ న్యాయవాది విజయభాస్కర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎటువంటి చర్యలు చేపట్టారో వివరించాలని బార్ కౌన్సిల్‌ను గతంలో ఆదేశించింది. దీంతో బైలా ప్రకారం ఏడుగురు సభ్యులతో అడ్ హక్ కమిటీని వేశామని బార్ కౌన్సిల్ ఛైర్మన్ తెలిపారు. అడ్ హక్ కమిటీ వేయటంపై కొందరు న్యాయవాదులు అప్పీల్ వేశారు. పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కమిటీ వేయటంపై స్టే విధిస్తూ .. న్యాయవాదుల ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేసింది.
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలకు సిద్ధం కావాలన్న హైకోర్టు... - బార్ అసోసియేషన్ పై హైకోర్టు స్టే
Bar Association Elections in AP: బార్ అసోసియేషన్ కార్యవర్గం గడువు ముగిసినా ఎన్నికలు జరపటం లేదంటూ న్యాయవాది విజయభాస్కర్ హైకోర్టులో వేసిన పిటీషన్‌పై ఈరోజు హై కోర్టు విచారణ చేపట్టింది. ఏడుగురు న్యాయవాదులతో అడహాక్ కమిటీని బార్ కౌన్సిల్ చైర్మన్ ఏర్పాటు చేయటంపై హైకోర్టు స్టే ఇచ్చింది. న్యాయవాదుల ఎన్నికలకు సిద్ధం కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Bar Association Elections