ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం పిటషన్​పై కౌంటర్ ఎందుకు వేయడం లేదు?' - అమరావతిపై హైకోర్టు

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అనుసరించి అమలు చేయటం లేదని వేసిన పిటిషన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు, రాజధాని సంబంధిత బిల్లులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఆగస్టు 6వ తేదీకి వాయిదా పడింది.

high court on amaravathi petition
రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ

By

Published : Jul 23, 2020, 2:19 PM IST

Updated : Jul 23, 2020, 2:56 PM IST

అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు, రాజధాని సంబంధిత బిల్లులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగిందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేశారని వెల్లడించారు. మొత్తం 32 కేసులను హైకోర్టు ధర్మాసనం విచారించిందన్నారు.

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అనుసరించి అమలు చేయటం లేదని వేసిన పిటిషన్​పై రెండేళ్లుగా ఎందుకు కౌంటర్ వేయటం లేదని కోర్టు ప్రశ్నించినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు లక్ష్మీనారాయణ వివరించారు. రాజధాని సంబంధిత బిల్లులు మరోసారి అసెంబ్లీలో పెట్టారు కాబట్టి విచారణ త్వరగా ముగించాలని తాము కోరగా... ధర్మాసనం ఆగస్టు 6వ తేదీకి విచారణ వాయిదా వేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: వైకాపా రాజ్యసభ సభ్యుల్లో 50% మందిపై తీవ్రమైన కేసులు

Last Updated : Jul 23, 2020, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details