HC LAWYERS PROTEST : హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ న్యాయవాదులు నిరసనలు కొనసాగించారు. భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. హైకోర్టు బయట జాతీయ జెండా వద్ద నిల్చుని నినాదాలు ఇచ్చారు. కొలీజియం తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. తీర్పులను అమలు చేయని ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుంటున్న ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయటం అన్యాయమన్నారు. బదిలీలను నిలిపి వేసే వరకూ వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తామన్నారు. గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.
న్యాయమూర్తుల బదిలీ.. కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళనలు - న్యాయవాదుల ఆందోళనలు
HC LAWYERS Agitation: రాష్ట్రంలో న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ న్యాయవాదులు మూడో రోజు నిరసన చేపట్టారు. జడ్జిల బదిలీలను నిలిపి వేసే వరకూ వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తామన్నారు.
HC LAWYERS PROTEST