High Court lawyer Lakshminarayana: సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌పై కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదులో తెలిపారు. ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చు కునేందుకు క్రిమినల్ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అరెస్ట్, కస్టడీలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను సీఐడీ ఏడీజీ ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. కేంద్ర హోంశాఖ, డీవోపీటీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కమిషన్ ఆన్ పిటిషన్లు, ఏపీ డీజీపీ, ఏపీ సీఎస్‌లకు ఫిర్యాదు చేశారు. పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో న్యాయవాది కోరారు.
సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ
High Court lawyer Lakshminarayana: సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌పై కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ దిల్లీలో ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు క్రిమినల్ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో న్యాయవాది కోరారు.
హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ