గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు జడ్జి డీవీఎస్ఎస్ సోమయాజులు.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు వేదమంత్రల మధ్య పూర్ణ కుంభంతో ఆలయ ఈవో నరసింహబాబు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు.. న్యాయమూర్తి దంపతులను ఆశీర్వదించారు.
శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి - High Court judge somayajulu latest news
గుంటూరు జిల్లా దుర్గిలో శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి సోమయాజులు ప్రత్యేక పూజలు చేశారు. న్యాయమూర్తి డివీఎస్ఎస్ సోమయాజులు.. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
జడ్జి దంపతులు.. ఆలయంలో గోమాతలకు గోపూజ నిర్వహించారు. అనంతరం ఈవో నరసింహబాబు పూల దండలతో సత్కరించి జ్ఞాపికలు, ప్రసాదం, ఆలయ చరిత్ర పుస్తకాలు అందజేశారు. ఆలయ చరిత్ర గురించి అర్చకులను అడిగి జడ్జి సోమయాజులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాచర్ల జడ్జీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ సీఐ భక్త వత్సల రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చదవండి:
న్యాయమూర్తి ఔదార్యం- దివ్యాంగుడి కారు వద్దే తీర్పు
Last Updated : Sep 12, 2021, 11:38 PM IST