ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీఎన్ రావు నివేదిక అమలుపై.. హైకోర్టులో అనుబంధ పిటిషన్

జీఎన్ రావు కమిటీ నివేదిక అమలు నిలుపుదలకు ఆదేశాలు ఇవ్వాలంటూ అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడు రామారావు హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన కోర్టు... తదుపరి విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేసింది.

high court issued orders on capital issue
హైకోర్టు

By

Published : Dec 31, 2019, 12:26 AM IST

Updated : Dec 31, 2019, 1:49 AM IST

రాజధాని అమరావతిలో నిర్మాణాలు కొనసాగించాలని.... జీఎన్ రావు కమిటీ నివేదిక అమలు నిలుపుదలకు ఆదేశాలు ఇవ్వాలంటూ అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడు రామారావు హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం... తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసింది. వచ్చే నెల 21 వ తేదీలోగా ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని తరలింపు అంశంలో బోస్టన్ కమిటీ పాత్రపై వాదోపవాదాలు జరిగాయి. బోస్టన్ కమిటీకి చట్టబద్ధత ఏమిటని పిటిషన్ తరఫున న్యాయవాదులు ప్రశ్నించారు. దీనిపై వివరాలు సమర్పిస్తామని ఉన్నత న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ తెలపడంతో... హైకోర్టు కేసు విచారణను వచ్చే నెల 23కి వాయిదా వేసింది. తొలుత వేసిన మెయిన్ పిటిషన్ విచారణ ఫిబ్రవరి 3న జరగాల్సి ఉండగా.. అనుబంధ పిటిషన్ దాఖలుతో కాస్త ముందుగానే రాజధాని అంశంపై విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Dec 31, 2019, 1:49 AM IST

ABOUT THE AUTHOR

...view details