Village Secretariats as Women police: గ్రామ సచివాలయ మహిళా పోలీసు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామ మహిళా కార్యదర్శులకు పూర్తిగా పోలీసు విధులు కేటాయించలేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. పోలీసు, మహిళా శిశు సంక్షేమశాఖకు అనుసంధానంగా విధులు కేటాయించినట్లు చెప్పారు. పోలీసు విధులు ఇవ్వలేదంటూనే.. మహిళా కార్యదర్శులను పోలీసు బందోబస్తుకు వాడుతున్నారని పిటిషన్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదించారు. అలాంటి లోపాలు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని ఏజీ తెలిపారు. పోలీసు విధులు కేటాయించబోమని.. చట్టంలో నిబంధనలు పొందుపరుస్తామని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది.
గ్రామ మహిళా కార్యదర్శులను పూర్తిగా పోలీసు విధులకు కేటాయించలేదన్న ఏజీ
HIGH COURT గ్రామ మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు విచారణ జరిగింది. గ్రామ మహిళా కార్యదర్శులకు పూర్తిగా పోలీసు విధులు కేటాయించలేదని, పోలీసు, మహిళా శిశు సంక్షేమశాఖకు అనుసంధానంగా కేటాయించామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు.
HIGH COURT