SAAP MD PRABHAKAR REDDY : ఉత్తరాఖండ్‌లో ఈ నెల 17న జరగనున్న జూనియర్ నేషనల్స్ కబడ్డీ టోర్నమెంట్లో ఇప్పటివరకు క్రీడాకారులను ఎంపిక చేయలేదనే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఆ వ్యాజ్యంపై విచారణలో భాగంగా హైకోర్టుకు శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఉత్తరాఖండ్ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు.. ఇప్పటివరకు క్రీడాకారులను ఎందుకు ఎంపిక చేయలేదని శాప్ ఎండీని న్యాయస్థానం ప్రశ్నించింది.
ఆ అంశంపై హైకోర్టుకు హాజరైన శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి - ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ ఎండీ
SAAP MD ATTEND TO THE HIGHCOURT : ఉత్తరాఖండ్ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు.. ఇప్పటివరకు క్రీడాకారులను ఎందుకు ఎంపిక చేయలేదని శాప్ ఎండీని హైకోర్టు ప్రశ్నించింది. క్రీడాకారుల సెలక్షన్ తన పరిధి లోనిది కాదని ప్రభాకర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.
![ఆ అంశంపై హైకోర్టుకు హాజరైన శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి SHAP MD ATTEND THE HIGHCOURT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16935541-704-16935541-1668510084095.jpg)
SHAP MD ATTEND THE HIGHCOURT
క్రీడాకారుల సెలక్షన్ తన పరిధి లోనిది కాదని ప్రభాకర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. యలమంచిలి శ్రీకాంత్, వీర్లలంకయ్య జట్ల మధ్య విభేదాలున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే వాళ్ల విభేదాలపై తాము లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసిన హైకోర్టు.. ఆ రెండు టీమ్స్ నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేయాలని శాప్ ఎండీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి: