ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూసేకరణ, పునరావాస అథారిటీలకు నాలుగు వారాల్లో పీవోల నియామకం - విజయవాడ, తిరుపతికి నాలుగు వారాల్లో పీవోలను నియమిస్తామన్న ప్రభుత్వం

గూంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన న్యాయవాది పొన్నకంటి మల్లికార్జునరావు వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ, తిరుపతిలో భూసేకరణ, పునరావాస అథారిటీలకు పీవోల నియామకంపై న్యాయస్థానం ప్రశ్నించింది. నాలుగు వారాల్లో కేటాయిస్తామని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

hc hearing on land acquisition, rehabilitation authorities pos allocation pil
భూసేకరణ, పునరావాస అథారిటీలకు పీవోల నియామకంపై హైకోర్టులో విచారణ

By

Published : Mar 6, 2021, 7:55 AM IST

విజయవాడ, తిరుపతిలో భూసేకరణ, పునరావాస అథారిటీలకు.. నాలుగు వారాల్లో ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పీవోల కేటాయింపులో జాప్యాన్ని సవాలు చేస్తూ.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన న్యాయవాది పొన్నకంటి మల్లికార్జునరావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ధర్మాసనం విచారణ చేసింది.

విశాఖకు ఇప్పటికే పీవోను కేటాయించినట్లు న్యాయస్థానానికి ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్​తో కూడిన ధర్మాసనం.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details