గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేని స్థలం కొనుగోలు చేశారని.. తక్కువ విలువ ఉన్న భూమిని ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేసిందంటూ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరపున హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు. బుడంపాడు, నారాకోడూరు మధ్య ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం 32 ఎకరాలు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఆ ఇళ్ల స్థలాలపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలి: హైకోర్టు - hearing on government house sites issue at prathipadu
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం... రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
![ఆ ఇళ్ల స్థలాలపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలి: హైకోర్టు high court hearing on govt house sites issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9401912-776-9401912-1604314659803.jpg)
ఆ ఇళ్ల స్థలాలపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలి: హైకోర్టు