ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యేల ఎర కేసు.. దర్యాప్తుపై ఉన్న స్టే ఎత్తివేసిన హైకోర్టు - ఎమ్మెల్యేల ఎర కేసు తాజా సమాచారం

Highcourt on Buying TRS MLAs Issue: తెలంగాణ హైకోర్టు తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. మొయినాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేయొచ్చని ఆదేశించింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ధర్మాసనం ఎత్తివేసింది. విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం పేర్కొంది.

telangana high court
telangana high court

By

Published : Nov 8, 2022, 5:25 PM IST

Highcourt on Buying TRS MLAs Issue: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ధర్మాసనం ఎత్తివేసింది. మొయినాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరుగుతున్న సమయంలో మొయినాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తుపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్టే విధించింది. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు.

ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తాజా తీర్పుతో ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు మొయినాబాద్‌ పోలీసులకు మార్గం సుగమమైంది. సీబీఐ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈకేసు విచారణ జరిపించాలని భాజపా దాఖలు చేసిన పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సి అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ పురోగతిపై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ప్రస్తుతం హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశముంది.

అసలేం జరిగిందంటే.. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్‌ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details