Recognition issue of DED colleges: రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ.. గతేడాది అక్టోబర్‌లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్‌సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. లోపాలను ఎత్తిచూపుతూ ఎన్‌సీటీఈ భవిష్యత్తులో నోటీసు ఇవ్వవచ్చని.. దానికి సకాలంలో సమాధానం ఇవ్వాలని డీఈడీ కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని పలు డీఈడీ కళాశాలలు ప్రవేశాలు కల్పించాయని.. వాటి గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ పాఠశాల విద్య కమిషనర్.. దిల్లీలోని ఎన్‌సీటీఈ లేఖ రాశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 318 డీఈడీ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీటీఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ 69 డీఈడీ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. అప్పట్లో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు.. ఎన్‌సీటీఈ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేసింది.
డీఈడీ కళాశాలలకు హైకోర్టులో ఊరట.. - 69 DED colleges approached the High Court
Recognition issue of DED colleges: నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని పలు డీఈడీ కళాశాలలు ప్రవేశాలు కల్పించాయని, వాటి గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ పాఠశాల విద్య కమిషనర్/డైరెక్టర్.. దిల్లీలోని ఎన్‌సీటీఈకి లేఖ రాశారు. దీంతో ఎన్‌సీటీఈ రాష్ట్ర వ్యాప్తంగా.. కొన్ని డీఈడీ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీటీఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ..పలు డీఈడీ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి.
![డీఈడీ కళాశాలలకు హైకోర్టులో ఊరట.. DED colleges problem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16941000-365-16941000-1668568779938.jpg)
డీఈడీ కళాశాలలు గుర్తింపు సమస్య