Jada Shravan Kumar comments: జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి లబించింది. ఈనెల 8న షరతులతో పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు వెల్లడించింది. అమరావతి ప్రాంతంలో పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ.. జైభీమ్ భారత్ పార్టీ ఇప్పటికే పోలీసులను రెండుసార్లు అనుమతి కోరింది. జైభీమ్ భారత్ పార్టీ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతి నిరాకరణపైజైభీమ్ భారత్ పార్టీ నేత సురేష్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశాడు. ప్రభుత్వం తరుఫున వాదించిన న్యాయవాది.. జడ శ్రవణ్ పర్యటన ఘర్షణలకు దారి తీస్తుందని కోర్టుకు తెలిపారు. పాదయాత్ర నిరాకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ.. పిటిషనర్ తరఫు లాయర్ హెకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. జులై 8న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయవద్దంటూ సూచించింది.
HC on Jada Shravan Padayatra: అమరావతిలో జడ శ్రవణ్ కుమార్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి.. కానీ..!
Jai Bheem Bharat Party: జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ పాదయాత్రకు హెకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై 8న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయవద్దంటూ సూచించింది.
ఆర్ 5 జోన్లో భూములు కేటాయించడంపై ఆగ్రహం: ఆర్ 5 జోన్లో రాజధానియేతరులకు ఇళ్ల పట్టాలివ్వటాన్ని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ వ్యతిరేకించారు. ఎస్సీ, ఎస్టీ రైతులు త్యాగం చేసి ఇచ్చిన భూమిని.. వేరే వారికి ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ 5 జోన్ అంశంలో అమరావతి రైతులకు నిరాశ మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలపై జగన్ ప్రేమ దృతరాష్ట కౌగిలిలాంటిదని అభివర్ణించారు. నిజంగానే పేదలపై ప్రభుత్వానికి ప్రేమ ఉందనుకుంటే పొరపాటని అన్నారు. 2014లో అమరావతి రాష్ట్ర రాజధాని అని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు.. మూడు పంటలు పండే భూములను రైతులు ఇచ్చారన్నారు.
గత ప్రభుత్వం సీఆర్డీఏ ఒక యాక్టును తయారు చేసి రైతులకు భరోసా ఇస్తూ ఒప్పందం ప్రకారం భూములు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు సీఆర్డీఏ ఒప్పందాలను తుంగలో తొక్కుతూ రైతులను మోసం చేసిందన్నారు. భూములు ఇచ్చిన రైతులపై జగన్ ప్రభుత్వం లాఠీ జులిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు టీడీపీ పార్టీ పేరును అంటగట్టి.. కక్షసాధింపుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సైనికుడు దేశానికి రక్షణగా ఉంటే.. రైతు ప్రజల ఆకలి తీర్చేమరో సైనికుడు రైతు అని అన్నారు. కొంత మంది అమరావతి రైతులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇవ్వడం రైతులు చేసిన పాపమా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.