ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెదేపా నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడిని.. గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విజయవాడ జైలు సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వక ఆదేశాన్నిచ్చిన హైకోర్టు... అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై వారానికి రెండుసార్లు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రిజనర్స్ చట్టం సెక్షన్ 39 ప్రకారం ఈ ఆదేశాలు ఇస్తున్నామన్న ధర్మాసనం.. చికిత్స కోసం వెళ్లే హక్కు ఆయనకు ఉందని తెలిపింది.
'అచ్చెన్నాయుడిని గుంటూరు రమేశ్ ఆస్పత్రికి తరలించండి' - Acchennaidu news today
మాజీమంత్రి అచ్చెన్నాయుడిని గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రిజనర్స్ చట్టం సెక్షన్ 39 ప్రకారం.. అచ్చెన్నాయుడికి చికిత్స కోసం వెళ్లే హక్కు ఉందని హైకోర్టు పేర్కొంది.
అచ్చెన్నాయడు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
Last Updated : Jul 8, 2020, 9:33 PM IST