ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో చుక్కెదురు.. రూ.లక్ష జరిమానా - high court on ippatam
![ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో చుక్కెదురు.. రూ.లక్ష జరిమానా high court on ippatam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17017821-525-17017821-1669277652158.jpg)
13:05 November 24
ముందస్తు నోటీసులు ఇచ్చారనే నిజం దాచారంటూ హైకోర్టు ఆగ్రహం
HIGHCOURT FINE TO IPPATAM VILLAGERS : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతపై బాధితులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఇళ్ల కూల్చివేతపై ముందస్తు నోటీసులు ఇచ్చారనే నిజం దాచి.. మధ్యంతర ఉత్తర్వులు పొందడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల కూల్చివేత ఘటనపై 14 మంది ఇప్పటం గ్రామస్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
TAGGED:
high court on ippatam