ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హయగ్రీవ భూముల ఆక్రమణపై హైకోర్టులో విచారణ.. కౌంటర్​ దాఖలుకు ఆదేశం - హయగ్రీవ భూముల ఆక్రమణ

Hayagriva Lands Issue : హయగ్రీవ భూములను ప్రభుత్వం ఆక్రమిస్తోందంటూ జనసేన నేత మూర్తియాదవ్​ వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

HIGH COURT ON HAYAGREEVA LANDS
HIGH COURT ON HAYAGREEVA LANDS

By

Published : Oct 20, 2022, 3:37 PM IST

Updated : Oct 21, 2022, 7:14 AM IST

HIGH COURT ON HAYAGREEVA LANDS: నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నందున విశాఖలో హయగ్రీవకు కేటాయించిన 12.51 ఎకరాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. హయగ్రీవ సంస్థ యాజమాన్య భాగస్వామితో పాటు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హయగ్రీవ సంస్థ నిర్మాణ పనులు చేపడుతోందని ఆప్రక్రియను నిలువరించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా .. ప్రస్తుతం ఇవ్వలేమన్న ధర్మాసనం .. కౌంటర్లు దాఖలు చేసిన అనంతరం పరిశీలిద్దామని వ్యాఖ్యానించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Last Updated : Oct 21, 2022, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details