High Court On Employment Guarantee bills: ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుల అంశంలో.. రాష్ట్ర ప్రభుత్వానికి.. హైకోర్టులో చుక్కెదురైంది. బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. నరేగా పథకం కింద చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని గతంలో కాంట్రాక్టర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆయా పిటిషన్లపై విచారించిన ధర్మాసనం.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని తీర్పునిచ్చింది.
ఉపాధి హామీ బిల్లులపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. రివ్యూ పిటిషన్లను డిస్మిస్ - 102 రివ్యూ పిటిషన్లు
HC On Employment Guarantee bills: ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. నరేగా పథకం కింద చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని గతంలో కాంట్రాక్టర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
![ఉపాధి హామీ బిల్లులపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. రివ్యూ పిటిషన్లను డిస్మిస్ HC On Employment Guarantee bills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17063872-853-17063872-1669719324722.jpg)
HC On Employment Guarantee bills
న్యాయస్థానం తీర్పుపై.. ప్రభుత్వం 102 రివ్యూ పిటిషన్లను దాఖలు చేసింది. కాంట్రాక్టర్లు అత్యధికంగా బిల్లులు పెట్టారని.. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్లను రివ్యూ చేయాలని కోరారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎమ్ బుక్ ఎంట్రీ చేస్తారు కదా అని.. ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. 102 రివ్యూ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి: