High Court comments on Social Security Pension: సామాజిక భద్రత పింఛన్‌కు అర్హులైనవారు (వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, తదితరులు) ఒకే ఇంట్లో ఇద్దరు నివసిస్తుంటే.. అందులో ఒక్కరికే పింఛన్ ఇస్తామంటూ రాష్ట్ర ప్రభ్వుత్వం 2019 డిసెంబర్లో తెచ్చిన జీవో 174లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఇది ఆర్థికాంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని పేర్కొంది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ఈ విషయంపై నిర్ణయాన్ని ప్రభుత్వ విచక్షణకే విడిచిపెడుతున్నట్లు పేర్కొంది.
వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ - పలు షరతులు విధించిన సీబీఐ కోర్టు
ఒకరికే పెన్షన్ సవాలు కోర్టుకు: చేస్తూ ఒకే ఇంట్లో పెన్షన్‌కు అర్హత ఉన్నవాళ్లు ఇద్దురు నివశిస్తున్నప్పటికీ జీవో 174 ప్రకారం ఒకరికే పెన్షన్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ Justice Dheeraj Singh Thakur), జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చింది. ఒకే ఇంట్లో అర్హులైన వృద్ధాప్య, వితంతు, ఒంటిరి మహిళలు ‘ఇద్దరు’ నివశిస్తున్నప్పటికీ జీవో 174లోని నిబంధన 4(1) ప్రకారం ఒకరికే పెన్షన్ ఇవ్వడానికి వీలుకల్పించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ (PIL in High Court) వేశారు. ఒకే ఇంట్లో ఉంటున్న వృద్ధులు, వితంతువుల్లో ఒకరికే పింఛను ఇస్తున్నారన్నారు. ఇలాంటి నిర్ణయం రాజ్యాంగం, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం మార్గదర్శకాలకు విరుద్ధం అన్నారు. పెన్షన్ చెల్లింపుల్లో కేంద్రప్రభుత్వం సైతం సహకారం అందిస్తోందన్నారు. కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ (Pension) ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.