High Court Comments on ANU Vice Chancellor: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోను సమర్థిస్తూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్ మీడియాతో సదస్సు నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. రాజకీయ సంబంధ విషయాల్లో పత్రిక సమావేశాలు పెట్టడానికి వీసీకి ఏమి సంబంధం అని ప్రశ్నించింది. విద్యా సంబంధ విషయాలపై దృష్టిపెట్టాలని హితవు పలికింది. భావప్రకటన స్వేచ్ఛ హక్కును దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించింది. ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్లు వారి పాత్రేమిటో తెలుసుకుని ప్రవర్తించాలంది. ఇలాంటి తీరును గతంలో ఎప్పుడైనా చూశామా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. బీఈడీ కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వీసీపై పలు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలపై కాదు.. విద్యావిషయాలపై దృష్టిపెట్టండి.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు - ఏపీ వార్తలు
High Court Comments on ANU Vice Chancellor: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోను సమర్థిస్తూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్ మీడియాతో సదస్సు నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ సంబంధ విషయాలతో వీసికి సంబంధం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. విద్యా సంబంధ విషయాలపై దృష్టిపెట్టాలని హితవు పలికింది.
హైకోర్టు వ్యాఖ్యలు