గుంటూరు జిల్లా, మంగళగిరి శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి... స్వామి వారికి ప్రథమ దర్శనం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయనకు జిల్లా న్యాయమూర్తులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
మంగళగిరి శ్రీ లక్ష్మి నృసింహ స్వామి సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ - గుంటూరు న్యూస్
గుంటూరు జిల్లా, మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ప్రారంభ వేడుకలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రథమ దర్శనం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయనకు జిల్లా న్యాయమూర్తులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
మంగళగిరి శ్రీ లక్ష్మి నృసింహ స్వామి సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్
శ్రీదేవీ, భూదేవి సమేతంతో నృసింహస్వామి ఉత్తర ద్వారంలో వేచ్చేయడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. కొవిడ్ నేపథ్యంలో మాస్కులున్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి:చెరకుతోటలో అగ్ని ప్రమాదం.. భారీగా పంట నష్టం
Last Updated : Dec 25, 2020, 9:57 AM IST