Bar Association Elections: ఏపీ హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సాయికుమార్ గెలుపొందారు. ఆయన మొత్తం 703 ఓట్లు పొందారు. అధ్యక్షుడి పదవికి బరిలో ఉన్న సీనియర్ న్యాయవాది వి.వేణుగోపాలరావుకు 683 ఓట్లు రాగా, మరో అభ్యర్థి డీఎస్ఎన్వీ ప్రసాదబాబుకు 38 ఓట్లు పొందారు. జానకీరామిరెడ్డి, వేణుగోపాలరావు మధ్య హోరాహోరా పోటీ జరిగింది. అంతిమంగా 20 ఓట్ల మెజారిటీతో జానకిరామిరెడ్డి గెలుపొందారు. ఇప్పటి వరకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకిరామిరెడ్డి కొనసాగారు. కాలపరిమితి ముగియడంతో తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు.
ఉపాధ్యక్షుడిగా పీఎస్పీ సురేశ్ కుమార్ గెలుపొందారు. ఆయనకు 739 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి జి తుహిన్ క్కుమార్కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్ గెలుపొందారు. ఆయనకు 780 ఓట్లురాగా సమీప అభ్యర్థి టి సింగయ్యగౌడ్కు 630 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శిగా ఎం సాల్మన్ రాజు గెలుపొందారు. గ్రంథాలయ కార్యదర్శిగా మిత్తిరెడ్డి జ్ఞానేశ్వరరావు, కోశాధికారిగా బీవీ అపర్ణ లక్ష్మి గెలిచారు. క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా పితాని చంద్రశేఖర్రెడ్డి గెలుపొందారు. మహిళా ప్రతినిధిగా రేవనూరు సుధారాణి ఏకగ్రీవమయ్యారు.