ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్న వ్యాజ్యంపై విచారణకు అనుమతి - ఏపీ తాజా వార్తలు

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్న వ్యాజ్యంపై మళ్లీ విచారణకు కోర్టు అనుమతించింది. విచారణ పునఃప్రారంభించాలని హైకోర్టుకు జడ్జి రామకృష్ణ అభ్యర్థన చేశారు. జడ్జి రామకృష్ణ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు విచారణకు అనుమతించింది.

High Court
High Court

By

Published : Aug 12, 2020, 8:17 AM IST

హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ పునఃప్రారంభించాలని కోరుతూ.. జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. తన వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మరో అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు.. కరోనా కట్టడికి.. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది.

ABOUT THE AUTHOR

...view details