ADVOCATES PROTEST AGAINST JUDGES TRNASFERS : జస్టిస్ దేవానంద్, జస్టిస్ రమేష్ బదిలీని వ్యతిరేకిస్తూ హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నోటికి నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు నుంచి క్యాంటిన్ వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు ఎదురుగా ఉన్న జాతీయ జెండా వద్ద నిరసన వ్యక్తం చేశారు. బదిలీపై కొలీజియం పునరాలోచించాలని కోరారు. హైకోర్టు తీర్పు అమలయ్యే విధంగా వ్యవహరిస్తున్న న్యాయమూర్తులపై బదిలీ చర్య తీసుకుంటే ఆ ప్రభావం మిగిలిన వారిపై కూడా పడుతుందన్నారు. బదిలీని నిలిపేంత వరకూ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.
న్యాయమూర్తుల బదిలీ.. నోటికి నల్లరిబ్బన్లు ధరించి న్యాయవాదుల నిరసన - న్యాయవాదుల నిరసన
HC LAWYERS PROTEST : హైకోర్టు నుంచి ఇద్దరు జడ్జిల బదిలీకి నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నోటికి నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
HC LAWYERS PROTEST
Last Updated : Nov 28, 2022, 9:52 PM IST