ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూముల విక్రయంపై హైకోర్టు విచారణ వాయిదా - ఏపీలో ప్రభుత్వ భూములు విక్రయం వార్తలు

మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. పిటిషన్లపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది.

High Court
High Court

By

Published : Jul 23, 2020, 5:04 PM IST

మిషన్ బిల్డ్ ఏపీ కింద ఈ-వేలం ద్వారా భూముల విక్రయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ప్రభుత్వం దీనికి సంబంధించి 150 పేజీల కౌంటర్​ను ఈరోజు ఆన్​లైన్​లో దాఖలు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

కౌంటర్​లోని విషయాలపై తమ అభ్యంతరాలను తెలిపేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. భూములు వేలం వేసినా హైకోర్టు తీర్పు అమలు చేయాలని గతంలో మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details