ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

High Court: టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలివ్వాలి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

High Court : రాజధాని పరిధిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల పంపిణీపై హైకోర్టు విచారణ జరిపింది. ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందరెందుకన్న పిటిషనర్ల అభ్యంతరంపై ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది .

Etv Bharat
Etv Bharat

By

Published : May 1, 2023, 3:19 PM IST

High Court : అమరావతి రాజధాని పరిధిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్​ చేస్తూ రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రాజధానిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా.. ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్​లు అభ్యంతరం లేవనెత్తుతున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టిడ్కో ఇళ్ల వ్యవహారంలో ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు అందజేయలేదని తెలిపింది.

"టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. రాజధాని ప్రాంతంలో 5 వేల టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలివ్వాలి. ఇళ్ల మంజూరులో విధివిధానాలు, పూర్తి రికార్డులను కోర్టు ముందుంచాలి."-హైకోర్టు

రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5000 టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల మంజూరుకు అనుసరించిన విధివిధానాలు, పూర్తి రికార్డులను న్యాయస్థానం ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మంగళవారం ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వుల అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే నిమిత్తం గుంటూరు(550.65ఎకరాలు), ఎన్టీఆర్‌(583.93 ఎకరాలు) జిల్లా కలెక్టర్లకు భూ బదలాయింపు నిమిత్తం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఈ ఏడాది మార్చి 31న జీవో 45 జారీ చేశారు. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు యూ.శివయ్య, కె.రాజేష్, బెజవాడ రమేశ్‌ బాబు, ఆలూరి రాజేష్, కుర్రా బహ్మ, కట్టా రాజేంద్ర వరప్రసాద్‌ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details