తూర్పు గోదావరి జిల్లా సోంపల్లి రేవులో సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య సందడి చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో "థాంక్యూ" అనే సినిమా చిత్రీకరణ కోసం రాజోలు వశిష్ట గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్ర బృందం పర్యటించింది. స్థానిక సోంపల్లి-అబ్బిరాజుపాలెం పంటిపై నటుడు నాగ చైతన్యపై చిత్రీకరణ జరిగింది. నాగచైతన్యను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
సోంపల్లిలో సందడి చేసిన సినీనటుడు నాగచైతన్య - సోంపల్లిలో సందడి చేసిన సినీనటుడు నాగ చైతన్య తాజా వార్తలు
సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య తూర్పు గోదావరి జిల్లా సోంపల్లి రేవులో సందడి చేశారు. ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా చిత్ర యూనిట్‌తో కలిసి సోంపల్లికి వచ్చారు.
సోంపల్లిలో సందడి చేసిన సినీనటుడు నాగ చైతన్య