ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పు డబ్బులు అడగా... భార్యపై దాడి చేసిన భర్త

భార్యను వరకట్నం కోసం చిత్ర హింసలకు గురి చేస్తున్న ఘటన వినుకొండలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకమ్మ అనే మహిళతో శివారెడ్డికి ఎనిమిదేళ్ల క్రితం విహహం జరిగింది. కట్నం కోసం భార్యను తరచు వేధిస్తుండటంతో మామ అదనంగా మరో రూ.10లక్షలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి డబ్బులు చెల్లించామని కోరగా భార్యపై దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

మామ డబ్బు అడిగాడని... కూతురిని కొట్టి వేధించాడు

By

Published : Jul 21, 2019, 8:50 PM IST

గుంటూరు జిల్లా వినుకొండలోని కొత్తపేట రామాలయం వీధిలో భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్న ఘటన వెలులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామానికి చెందిన వెంకమ్మ అనే యువతితో ఎనిమిదేళ్ల క్రితం శివారెడ్డికి వివాహమైంది. వివాహ కట్నం కింద పది లక్షలు నగదు ఇచ్చారు. కొద్ది కాలం తర్వాత వెంకమ్మను శివారెడ్డి తరచూ మద్యం సేవించి వచ్చి కొట్టేవాడు. దీంతో మరో పది లక్షలు కూడా శివారెడ్డికి మామ అప్పుగా ఇచ్చాడు. ఇచ్చిన 10 లక్షలు ఇటీవల తిరిగి ఇవ్వమని శివారెడ్డిని అడిగాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అల్లుడు భార్య వెంకమ్మపై చేయి చేసుకున్నాడు. నిన్న రాత్రి మద్యం సేవించి దాడి చేయగా .. ఆమె తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు సమాచారంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని వెంకమ్మను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మామ డబ్బు అడిగాడని... కూతురిని కొట్టి వేధించాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details