Hepatitis Cases Increasing in AP: హెపటైటిస్ బీ, సీ వైరస్‌లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్ బారిన పడుతున్నవారిలో కొందరికి కాలేయ క్యాన్సర్ సోకుతోంది. హెపటైటిస్ వైరస్‌లో....ఏ, బీ, సీ, డీ, ఈ అని ఐదు రకాలున్నాయి. ఇందులోబీ, సీ వైరస్‌లు ప్రమాదకరమైనవని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకే ఏ, ఈ రకాల వల్ల కామెర్లు వస్తున్నాయని వివరిస్తున్నారు. హెపటైటిస్-ఏకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్-B బాధితుల నుంచి రక్తం, లాలాజలం, వీర్యం, యోని స్రావాలతో ఇతరులకూ వ్యాపిస్తోంది. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులు ఉపయోగించిన ఇంజెక్షన్‌లు, పచ్చబొట్లు, షేవింగ్, బ్లేడ్లు, ట్రూత్ బ్రష్‌లు వాడటం వల్ల ఈ వ్యాధి సోకుతోంది. బాధితుల్లో జ్వరం, అజీర్ణం, వాంతులు, వీరేచనాల సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.
జాతీయస్థాయిలో హెపటైటిస్-బీ మరణాలు..
జాతీయస్థాయిలో హెపటైటిస్-బీలో మరణాలు ఒక శాతం వరకు ఉన్నాయి. కేంద్ర సిరో సర్వైలెన్స్ ద్వారా రాష్ట్రంలో హెపటైటిస్-బీ 2.3శాతం, హెపటైటిస్-సీ 0.3శాతం వ్యాప్తి ఉన్నట్లు తేలింది. జాతీయ స్థాయిలో హైపటైటిస్-బీ 0.9శాతం, హెపటైటిస్-సీ 0.32శాతంగా ఉంది. రాష్ట్రంలోని జైళ్లల్లో ఉండే ఖైదీల్లో....2.6 శాతం మందికి హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీతో 0.5శాతం మంది ఉన్నారని ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల ద్వారా తేలింది. గుంటూరు జిల్లాలో 7 శాతం వరకు హెపటైటిస్ ప్రభావం ఉందని చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌లోని గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో 100 మంది రోగుల్లో 10 మందికి హెపటైటిస్ సమస్య ఉందని వైద్యులు తెలిపారు.
గర్భిణికి జ్వరం, కామెర్లు వస్తే..